Vinukonda: డీఎస్పీ హనుమంతరావు పత్రాలు లేని 45 బైకులు, ఆటో స్వాధీనం!

Vinukonda: నియోజకవర్గం ఈపూరు మండలం బొమ్మరాజుపల్లిలో పోలీసులు విస్తృత కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలు లేని 45 బైకులను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 7 July 2026 5:03 PM IST
Vinukonda
X

Vinukonda: డీఎస్పీ హనుమంతరావు పత్రాలు లేని 45 బైకులు, ఆటో స్వాధీనం!

వినుకొండ: నియోజకవర్గంలోని ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, వివాదాలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని గ్రామస్థులకు అవగాహన కల్పించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

ప్రజలు పోలీసులకు సహకరించి చట్టాలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story