Addanki: డీఎస్సీ లోపాలపై YCP మండిపాటు: మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్!
Addanki: ఏపీలో డీఎస్సీ అవకతవకలపై అద్దంకిలో YCP రిలే నిరాహార దీక్షలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని బత్తుల బ్రహ్మానందరెడ్డి, అశోక్ డిమాండ్.
Addanki: డీఎస్సీ లోపాలపై YCP మండిపాటు: మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్!
ప్రకాశం జిల్లా అద్దంకి: నీట్ పరీక్ష పత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ప్రధానమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విధంగానే రాష్ట్రంలో డీఎస్సీలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి టాస్క్ ఫోర్స్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి అద్దంకి బంగ్లా రోడ్డు లో వైయస్సార్ సిపి చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సాఫ్ట్ బాల్ ఆటలో 39 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. అవకతవకలపై వైఎస్ఆర్సిపి నిరసన తెలియజేస్తుంటే కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు. కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వైయస్సార్సీపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తల నినాదాలు చేశారు.




