Darsi: దర్శిలో తాగునీటి సమస్యపై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తక్షణ స్పందన

Darsi: దర్శిలోని సాయినగర్, శాంతినగర్‌లలో తాగునీటి సమస్యపై టీడీపీ ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్పందించి, కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Sept 2026 3:40 PM IST
Darsi
X

Darsi: దర్శిలో తాగునీటి సమస్యపై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తక్షణ స్పందన

దర్శి: దర్శి మున్సిపల్ పరిధిలోని సాయినగర్, శాంతినగర్ ప్రాంతాల్లో తాగునీటి సమస్యపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తక్షణమే స్పందించారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

దర్శి మున్సిపల్ వాటర్ సప్లైకు సంబంధించిన మోటార్లు మరమ్మతులకు గురికావడంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారని డాక్టర్ లక్ష్మీ తెలిపారు. వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులతో మాట్లాడడంతో పాటు జిల్లా కలెక్టర్ రాజాబాబును కలిసి మోటార్లను తక్షణమే మరమ్మతులు చేయించి పట్టణంలో తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.

దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. మున్సిపల్ కమిషనర్, వాటర్ వర్క్స్ అధికారులు ఆయా ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్