Bapatla: డాక్టర్ ఈవూరి పోలేరయ్యకు గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు!

Bapatla: రేపల్లె శివాని డిగ్రీ కాలేజ్ అధ్యాపకుడు డాక్టర్ ఈవూరి పోలేరయ్యకు గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు 2026. గుంటూరులో అవార్డు ప్రదానం.

VIJAYA KISHORE, REPALLE
Published on: 13 Sept 2026 7:08 PM IST
Bapatla
X

Bapatla: డాక్టర్ ఈవూరి పోలేరయ్యకు గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు!

Bapatla: చెరుకుపల్లి లోని శివాని డిగ్రీ కళాశాల కామర్స్ విభాగ అధ్యాపకులు డాక్టర్ ఈవూరి పోలేరయ్య కు ప్రతిష్టాత్మకమైన "గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు 2026" వరించింది. విద్యా రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలకు గాను ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. గుంటూరులో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావుల చేతుల మీదుగా పోలేరయ్య ఈ అవార్డును అందుకున్నారు.

కేవలం 27 ఏళ్ల పిన్న వయస్సులోనే పీహెచ్‌డీ పూర్తి చేసి రికార్డు సృష్టించిన డాక్టర్ పోలేరయ్య, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించడంతో పాటు పలు జర్నల్స్‌లో ప్రచురించారు.బోధనా రంగంలోనే కాకుండా సామాజిక దృక్పథంతో సొంతంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తూ విద్యారంగానికి మహోన్నత సేవలు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా శివాని డిగ్రీ కళాశాల చైర్మన్ ఏడుకొండల రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది డాక్టర్ పోలేరయ్యను ప్రత్యేకంగా అభినందించారు.ఆయన సాధించిన ఈ గుర్తింపు తమ కళాశాలకు మరియు ప్రాంతానికి ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ పోలేరయ్యను రీసెర్చ్ గైడ్, మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు, మాజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పేరం జయశీలరావు ప్రత్యేకంగా అభినందించారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE