Guntur: నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు!
Guntur: గుంటూరు డీసీఎంఎస్ అభివృద్ధి తన లక్ష్యమని, తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని చైర్మన్ వడ్రాణం హరిబాబు స్పష్టం చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు.
Guntur: నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు!
Guntur: గుంటూరు డీసీఎంఎస్ అభివృద్ధే లక్ష్యం నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం.అంటున్న వడ్రాణం హరిబాబు, వడ్రాణం హరి బాబు కామెంట్స్. బుధవారం గుంటూరు DCMS లో మీడియాతో మాట్లాడ్తున్న వడ్రాణం హరిబాబు.
నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, నాకు ఈ యొక్క చైర్మన్ గా డీసీఎంఎస్ కి సేవ చేయమని అవకాశం కల్పించారు.నేను వారి ఆదర్శాలకి,అలాగే వారి సందేశాలకి, అలాగే కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా మచ్చ తెచ్చే విధంగా నేను చేయలేదు.
ఈ సంవత్సర కాలంగా ఈ డీసీఎంఎస్ అభివృద్ధే దీనికి సాక్ష్యం.నేనుగా చెప్పేది, ఏమిటంటే పేపర్ల జ్యోతి సోషల్ మీడియా లో నాపై వస్తున్న వార్తలు ఇంకోటి కూడా చెబుతున్నా, సుమారుగా గతంలో ఏమో నాకు తెలియదు కానీ అప్పుడు పెద్దగా లాభాలు రాలేదు కానీ నేను వచ్చిన ఈ సంవత్సరంలో సివిల్ సప్లైస్ ద్వారా ధాన్యం కొనుగోలు మీద సుమారు 8.5 కోట్లు మా కమిషన్ మేము నేను వచ్చిన తర్వాత 8.5 కోట్లు కమిషన్ వచ్చింది.
దానికి జీతాలు ఎంతయ్యా అంటే ఇప్పటివరకు పే చేసింది 2.5 కోట్లు. అంటే మొన్న ఎవరో ఇంకో ఎంప్లాయి, అన్నారు.12 మంది ఎంప్లాయి, ఈ ధాన్యం కొనుగోలు మీద ఏదో జీతాలని, ఏదో నెగిటివ్ గా ప్రచారం చేశారు.
ఒకటే చెబుతున్నా, 8.5 కోట్లు ధాన్యం కమిషన్ వస్తే సుమారు 2.5-3 కోట్లు జీతాలు అయితే మిగిలిందంతా కంపెనీకి, డీసీఎంఎస్ కి, ఆదాయం చేకూర్చిన ఘనత నాది, చైర్మన్గా.అలాగే శనగలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, వీటి మీద కమిషన్ సుమారుగా 2 కోట్ల చిల్లర వచ్చింది. మొత్తం ఈ సంవత్సరం డీసీఎంఎస్ కి ఈ యొక్క కొనుగోలు ద్వారా ప్రొక్యూర్మెంట్ ఏజెంట్ గా ఉన్నందుకు మాకు 10.5 కోట్లు కమిషన్ వచ్చింది.
ఈ సంవత్సరం. అయితే ఈ కమిషన్ అంతా గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. కాకపోతే నేను పాత బకాయిలన్నీ వసూలు చేసి మా యొక్క సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ నేను కృషి చేస్తా ఉన్నాను.
ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా, నా మీద వ్యక్తిగతంగా కోపం ఉంటే అవసరమైతే వచ్చి నన్ను పర్సనల్ గా దూషించండి. లేకపోతే ఇంకోటి, మీకు కోపం తీరాలి అంటే మీ ఇష్టం, నేను ఎందుకంటే ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నాను.
నా దగ్గరికి ఎవరు ఏ పని కావాలని వచ్చినా నేను వాటికి చేయటానికి సర్వదా 24 గంటలు కూడా నేను సిద్ధంగా ఉండి రోజు నా దగ్గరికి ఒక 20 మంది రైతులు గాని, లేకపోతే వ్యక్తిగతంగా పనులకు గాని నా దగ్గరికి వస్తే నేను సత్ఫలం ఇవ్వాలి, సేవ చేస్తా ఉండాలి.అంటే మాకు మా అభినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, గత 15 సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశంలో నేను పని చేస్తుంటే క్రమశిక్షణతో నా మీద బాధ్యతతో నా మీద నమ్మకంతో బాధ్యత కలిగినటువంటి గుడివాడ గన్నవరం నియోజకవర్గాలు నాకు అప్పచెప్పడం జరిగింది.
ఇప్పుడు ప్రతిపక్షంలో 2019-20 టైం నుంచి మొన్న గెలిపించే టైం వరకి ఒకటి కాదు, రెండు నియోజకవర్గాలకు అభ్యర్థిగా ఉన్న కొడాలి నాని, వల్లభ నేని వంశీ అలా ఎంతో మంది తో పార్టీని అక్కడ ఇద్దరు ఎమ్మెల్యే లని మంచి మెజారిటీతో గెలిపించి వచ్చారు.
దానికి గా సేవ చేస్తుంటే, కొంతమంది చూడలేక, ఓర్వలేక, రాజకీయం కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు. నా మీద ఇలా దిగటం అనేది చాలా హేయమైన చర్య. నేను దీని మీద కూడా ఎవరైతే దీని వెనకాల కుట్ర చేస్తుఉన్నారో వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాను...
అలాగే, ఇంకోటి కూడా చెబుతా ఉన్నా: మొన్న ఈ మధ్య పత్తిపాడు ఎమ్మెల్యే గారు బూర్ల రామాంజనేయులు గారు ఒక దానిమీద గోరంట్లో నీళ్లు సమస్య వస్తే, దాని మీద నేను వారి దగ్గరికి వెళ్లి అడిగాను. వారు కూడా స్పందించి, ఆ అధికారులతో మాట్లాడారు.
అలాగే ఇంకోటి, మట్టి సమస్య ఏదో ఉందని అంటే, దాని మీద మాట్లాడాను. అంటే, కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఎమ్మెల్యే గారిని ఆ రెండు అడిగారు, అందుకని ఇవన్నీ ప్రచారాలు వస్తున్నాయి మీ మీద అని చెప్పి చెబుతా ఉన్నారు.
నేను ఒకటే చెబుతా ఉన్నా నేను ఎవరినీ, నేను ఈ సందర్భంగా, నేను బ్లేమ్ చేయట్లేదు. నేను పార్టీ అధినాయకత్వానికి కట్టుబడి ఉంటా. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఏమి ఆదేశించితే, అది శిరసా వహిస్తూ నేను ఎప్పుడూ దానికి కట్టుబడి ఉండే వ్యక్తిని.
ఇంకోటి కూడా చెబుతా ఉన్నా గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎప్పుడూ చెబుతా ఉంటారు, ఆయన మాటలో నా యొక్క చెవుల్లో మారుమోగుతా ఉంటాయి.మనము నీతి నిజాయితీలతో రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, సేవ చేస్తా ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తా ఉండాలని వారు ఎప్పుడూ నాకు చెబుతా ఉంటారు.
అలాగే నాయకులకు ఎవరికైనా, ఆయన చెప్పేది ఇదే: ఆయన చెప్పిన మాటల ప్రకారం, నేను గత సంవత్సర కాలంలో మీరు ఎక్కడ ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ రైతుని అడిగినా, మీకు యూరియా అందుతుందా అని అడిగితే తెలుస్తుంది.
మీకు డిఏపి అందుతుందా అంటే, ఇప్పటివరకు మేము అందిస్తా ఉన్నాం. ఇంకోటి, యాప్ పెట్టారు. ఆ యాప్ ద్వారా కూడా ఎవరికి ఎన్ని అందాలో, అన్ని సక్రమంగా అందిస్తా ఉన్నాం.మీకు ఒకటే చెబుతా ఉన్నా: మా యొక్క డిసీఎంఎస్ లో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కొంతమంది సుమారుగా ఒక 15 మంది అవినీతి చేస్తే, వాళ్ల పేర్లు కూడా చెప్పా. వాళ్లని, అలాగే ఈ 15 మందిని, నేను చట్టపర శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకున్నా, తీసుకుంటున్నాను.
వాళ్లకు నచ్చకపోవచ్చు, నేను లేకపోతే ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. మంచి చేసేటప్పుడు ఎప్పుడైనా కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎప్పుడైనా కాయలు ఉన్న చెట్టుకే రాళ్లు పడతా ఉంటాయి.అలాగే నేను దీన్ని నేను పాజిటివ్ గా, నేను మా దాసు చెప్పిన విషయాన్ని ఆవేశంలో వెళ్లి ఎవరో చెప్పిన మాటల్ని చెప్పిన విషయాన్ని కూడా నేను అతన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు. కాకపోతే, ఆవేశంలో తండ్రి లాంటి నా మీద మీకు నేను వచ్చిన తర్వాత జీతాలు పెంచా.
గతంలో ఎవరో ఎప్పుడూ 2000 రూపాయలు ఒక్కసారిగా పెంచలా, ఎంప్లాయిస్ కి నేను వచ్చిన తర్వాత మీకు జీతాలు పెంచా. నేను మీకు ఎవరైతే కష్టపడి పని చేస్తారో, వాళ్లకు కూడా ఇంకా భవిష్యత్తులో జీతాలు పెంచుతాను అని చెబుతున్నా.నాకు చేతనైతే ఎవరైతే కష్టపడి పని చేస్తా ఉంటారో, వాళ్లని వెళ్లి నేను వెళ్లే లోపల వాళ్లని పర్మనెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటే చేస్తానని చెబుతున్నా. అందరిని నా కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నాను.
మీరు ఎవరు ఇలా అపవాదులు వేయడం అనేది నాకు కొంచెం మానసికంగా బాధ కలిగిస్తా ఉన్నది.అయినా నేను ఇందాక చెప్పాను, పాజిటివ్ గా తీసుకుంటా. చంద్రబాబు గారు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏదైతే డిసీఎంఏ చైర్మన్ గా నాకు బాధ్యతలు అప్పచెప్పారో, దాన్ని నా యొక్క టైం ఉన్నంత వరకు కూడా 10x స్పీడ్ తో అభివృద్ధి పదంగా ముందుకు తీసుకువెళ్లి, రైతుల సంక్షేమం కోసమే నేను పని చేస్తానని, అలాగే మా డిసీఎంఎస్ ని ఈ యొక్క ఫండ్స్ రూపంలో కూడా స్థిరమైనటువంటి నికర ఆదాయం ప్రతి నెల వచ్చేటట్లుగా నేను ఏదైతే అనుకున్నానో, దాన్ని ఆచరణ యోగ్యంగా తీసుకువెళ్తున్నానని మీ అందరికీ, పత్రికా ముఖంగా
తెలియజేస్తున్న అలాగే ఎవరైతే నా శత్రువులు ఉన్నారో, వాళ్లకు కూడా, అంటే ఎవరైతే వాళ్లు అనుకున్నారు, నాకైతే ఎవరు శత్రువులు కాదు, నేను అందరిని ప్రేమగానే చూస్తాను. లేకపోతే నేను ప్రేమగా చూడకపోతే, ఇవాళ నా కోసం ఇంతమంది ఆత్మీయంగా పార్టీలకి సంబంధం లేకుండా కూటమి నాయకులు అందరూ రైతులు మా ఎంప్లాయిస్ అందరూ వచ్చి నిలబడ్డారు.
వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీడియా సోదరులకు కూడా నేను విన్నపాలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు... అని అన్నారు..




