Potluru: ధ్రువపత్రాలు లేని బైకులు, ఆటోలు సీజ్ నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు

Potluru: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పొట్లూరులో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్. ధ్రువపత్రాలు లేని 54 వాహనాలు సీజ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన.

KAREEMULLA, VINUKONDA
Published on: 25 Aug 2026 10:39 AM IST
Potluru
X

Potluru: ధ్రువపత్రాలు లేని బైకులు, ఆటోలు సీజ్ నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు

Potluru: గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాల మేరకు నరసరావుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామంలో మంగళవారం కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ,గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన ధ్రువపత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలను, 2 ఆటో లను సీజ్ చేసినట్లు తెలిపారు.

గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు, నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని డీఎస్పీ ప్రజలకు సూచించారు.

అలాంటి సమాచారాన్ని ఇతరులకు షేర్‌ చేయడం ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story