Guntur: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!

Guntur: తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదిత పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 15 Sept 2026 8:34 PM IST
Guntur
X

Guntur: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!

గుంటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ మంగళవారం పరిశీలించారు. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఈ నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిత పర్యటన ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సి.ఆర్.డి.ఏ అదనపు కమీషనర్ ఎ.భార్గవ్ తేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అదనపు ఎస్పీ ఎ.టి.వి రవి కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, ఎం.టి.ఎం.సి కమిషనర్ అలీం భాషా, రహదారులు భవనాలు శాఖ కార్యనిర్వహక ఇంజనీర్ సి.విశ్వనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN