Bapatla: కారంచేడు రహదారిపై ముళ్లకంపల తొలగింపు.. ప్రమాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం
Bapatla; బాపట్ల జిల్లా కారంచేడు రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు గౌతమ బుద్ధ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జేసీబీలతో ముళ్లకంపలను తొలగిస్తున్నారు.
Bapatla: కారంచేడు రహదారిపై ముళ్లకంపల తొలగింపు.. ప్రమాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం
బాపట్ల జిల్లా: కారంచేడు రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు, వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పిచ్చి మొక్కలు, ముళ్లకంపలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గౌతమ బుద్ధ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రతినిధి చుండూరు రామయ్య తెలిపారు.
చీరాల నుండి నిత్యం కారంచేడు మీదుగా హైదరాబాద్, చిలకలూరిపేటతో పాటు పలు ప్రాంతాలకు భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో రహదారికి ఇరువైపులా విస్తారంగా పెరిగిన తుమ్మ చెట్లు, జంగిల్ కంప రోడ్డు మార్జిన్లను పూర్తిగా కప్పివేశాయి.
గతంలో నాటిన కానుగ చెట్లను సైతం ఈ పిచ్చిమొక్కలు కప్పేయడంతో మార్గం అత్యంత ఇరుకుగా మారింది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి నిత్యం తీవ్ర ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాత్రివేళ బస్సులు, ఆటోల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాద తీవ్రతను గమనించిన గౌతమ బుద్ధ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రతినిధి చుండూరు రామయ్య, తమ సొంత ఖర్చులతో జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేసి రహదారిని శుభ్రం చేయించే పనులను స్వచ్ఛందంగా చేపట్టారు.
గ్రామంలో కేంద్రమంత్రి పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రారంభించిన మూడు ఆర్వో ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను ఘంటా కృష్ణదాసు కుమార్తె పద్మజ సహకారంతో నిరంతరం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.




