Bapatla: చిరంజీవి జన్మదిన వేడుకలు ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ!
Bapatla: బాపట్లలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు, ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ.
Bapatla: చిరంజీవి జన్మదిన వేడుకలు ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ!
Bapatla: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బాపట్లలో అభిమానులు ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షులు విష్ణు మొలకల చంద్రమోహన్ మాట్లాడుతూ.. చిరంజీవికి బాపట్లతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు.
చిరంజీవి చిన్నతనంలో ఆయన తండ్రి ఉద్యోగరీత్యా బాపట్లలో నివసించిన సమయంలో 8, 9 తరగతులను బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో చదువుకున్నారని తెలిపారు. అప్పట్లో తరచూ బాపట్ల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకునేవారని గుర్తుచేశారు. దీంతో మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఆయన పేరున ఆంజనేయస్వామికి ప్రత్యేక అర్చన చేయించి, చిరంజీవి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు చెప్పారు.
అనంతరం బాపట్ల ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ సిద్ధార్థ చేతుల మీదగా గర్భిణీ స్త్రీలకు రోగులకు ఫ్రూట్స్, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి సీనియర్ అభిమాని జ్యూస్ కొట్టు శీను మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
చిరంజీవి ఎప్పటి నుంచో రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని శీను అన్నారు. ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఫ్రూట్స్, పౌష్టికాహారం పంపిణీ చేసినట్లు తెలిపారు. అభిమానులంతా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం బాపట్ల పాత బస్టాండ్ వద్ద మెగాస్టార్ చిరంజీవి జన్మదిన కేక్‌ను కట్ చేసి అభిమానులకు, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. దశాబ్దాలుగా చిరంజీవి తమకు అభిమాన నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాలకు మార్గదర్శకుడిగా ఉన్నారని శీను, విష్ణు మొలకల చంద్రమోహన్ పేర్కొన్నారు. చిరంజీవి మరిన్ని విజయాలు సాధించి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు జ్యూస్ కొట్టు శీను, కొలను మోహన్ శ్రీనివాస్, తిమ్మన శేషు నాయుడు, లల్లు, మాడా రామకృష్ణ, పాలపర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




