Chirala: బాధితులకు అండగా ఉంటాం ఆక్వా రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే!
Chirala: కొత్తపేటలో ఆక్వా రైతు ఇంటిపై దుండగుల దాడి. బాధిత లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య.
Chirala: బాధితులకు అండగా ఉంటాం ఆక్వా రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే!
Chirala: వేటపాలెం మండలం కొత్తపేటలో శుక్రవారం రాత్రి ఆక్వా రైతు చెరుకూరి లక్ష్మీనారాయణ ఇంటి వద్ద దుండగులు హల్‌చల్ చేశారు. మాస్కులు ధరించి ఇనుప రాడ్లతో వచ్చిన దుండగులు ఇంటి అద్దాలు, పోర్టికోలో ఉన్న కారును ధ్వంసం చేసి వెళ్లిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెబుతూ, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. దుండగులను సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ప్రజలకు భద్రత కల్పించే విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బాధిత కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హామీ ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




