Chirala: జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
Chirala: చీరాలలో జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లపై నాయకులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రత్యేక పూజలు, బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
Chirala: జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
చీరాల: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు జనసేన పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం చీరాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జనసేన పార్టీ చీరాల నియోజకవర్గ పరిశీలకులు ఆళ్ళ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రసాద్ థియేటర్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఉదయం 9 గంటలకు ప్రసాద్ థియేటర్ వద్ద నుంచి సప్తగిరి లాడ్జ్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
సప్తగిరి లాడ్జ్ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు ముందుండాలని నాయకులు పిలుపునిచ్చారు. జన్మదిన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్కే నాయుడు, ఐటీ కోఆర్డినేటర్ భూపతి మనోజ్ కుమార్, వీర మహిళ ఏఎంసీ డైరెక్టర్ కారంపూడి పద్మిని, పసుపులేటి సాయి, షేక్ హుర్ భాష, తోట అశోక్ చక్రవర్తి, ఆళ్ళ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.




