Chirala: మందు బాబుల వీరంగం.. వైన్ షాప్ వద్ద రక్తం చిందిన వేళ!
Chirala: చీరాల హరిప్రసాద్ నగర్ వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో యువకుల వీరంగం.
Chirala: మందు బాబుల వీరంగం.. వైన్ షాప్ వద్ద రక్తం చిందిన వేళ!
Chirala: చీరాలలో హరిప్రసాద్ నగర్ గేటు వద్ద ఓ వైన్స్ దుకాణం వద్ద మందుబాబులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో యువకులు బీరుసీసాలతో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. యువకులు చేసిన అలజడికి చుట్టుపక్కల ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనస్థలానికి పోలీసులు చేరుకొని దాడికి పాల్పడిన ఇద్దరి యువకులని అదుపులోకి తీసుకున్నారు. మద్యం షాపు వద్ద జరుగుతున్న గొడవను అడ్డుకున్నందుకు తమపై బీరు సీసాలతో జవహర్ నగర్ కు చెందిన ఇద్దరు యువకులు దాడిచేశారని ఆసిరినాయుడు, రాంబాబు, లక్షణ్ లు తెలిపారు.
Next Story




