Chirala: చీరాలలో ఘనంగా బి.పి. మండల్ జయంతి వేడుకలు బిజెపి ఓబీసీ మోర్చా!
Chirala: చీరాల బిజెపి కార్యాలయంలో బి.పి. మండల్ జయంతి వేడుకలు. సామాజిక న్యాయం, ఓబీసీ హక్కుల కోసం బి.పి. మండల్ చేసిన కృషి చిరస్మరణీయమని నేతల నివాళి.
Chirala: చీరాలలో ఘనంగా బి.పి. మండల్ జయంతి వేడుకలు బిజెపి ఓబీసీ మోర్చా!
Chirala: చీరాల పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఓబిసి రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ మరియు బాపట్ల జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణారావు సూచన మేరకు బి.పి. మండల్ జయంతి కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ తాడివలస దేవరాజు గారి అధ్యక్షతన బి.పి. మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ, బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బి.పి. మండల్) భారతదేశంలో సామాజిక న్యాయం, వెనుకబడిన తరగతుల హక్కులు, సమాన అవకాశాల కోసం కృషి చేసిన మహనీయుడని అన్నారు. దేశంలోని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల పరిస్థితులను అధ్యయనం చేసి, వారికి తగిన ప్రాతినిధ్యం మరియు అవకాశాలు కల్పించేందుకు మండల్ కమిషన్ ద్వారా ఆయన చేసిన కృషి చారిత్రాత్మకమైనదని తెలిపారు.
1979లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు బి.పి. మండల్ అధ్యక్షత వహించారని, కమిషన్ 1980లో తన నివేదికను సమర్పించిందని డాక్టర్ దేవరాజు వివరించారు. వెనుకబడిన తరగతుల సామాజిక, విద్యా అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించాలని మండల్ కమిషన్ సిఫారసు చేసిందని తెలిపారు.
బి.పి. మండల్ ఆశయాలను ప్రతి ఓబీసీ కుటుంబానికి చేరవేసి, సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాల కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని డాక్టర్ తాడివలస దేవరాజు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కారంచేటి నగేష్ కుమార్ , నాశిన మణికుమార్ , క్షత్రియ సుహాసిని బాయ్,పింజల భరణి రావు, మేడికొండ భరణి రావు , పోతుల ప్రకాష్, పేర్ల బ్రహ్మయ్య , బాంబే సురేష్ బీజేపీ నాయకులు, ఓబీసీ మోర్చా నాయకులు, బిజెపి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




