Chirala: చీరాలలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు
Chirala: చీరాలలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవో నరసింహారావుకు వినతి పత్రం అందజేత.
Chirala: చీరాలలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు
చీరాల: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (APUWJ) 70 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం చీరాలలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా చీరాల ప్రాంతీయ కమిటీ సభ్యులు గడియార స్తంభం సెంటర్ నుండి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకొని ఆర్టీవో నరసింహారావుకు వినతి పత్రం అందజేశారు.
హెల్త్ స్కీము, ప్రమాద బీమా పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. అలాగే ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్లు అందజేసి అండగా ఉండాలన్నారు.
అర్హులకు నివేశన స్థలాలు అందించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు.
Next Story




