Chilakaluripet: మైనార్టీ గురుకుల పాఠశాల పనులు ప్రారంభించాలి!
Chilakaluripet: చిలకలూరిపేటలో నిలిచిపోయిన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల పనులను వెంటనే ప్రారంభించాలని ఆవాజ్ కమిటీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వినతి ఇచ్చింది.
Chilakaluripet: మైనార్టీ గురుకుల పాఠశాల పనులు ప్రారంభించాలి!
Chilakaluripet: తాతపూడి గ్రామంలో నిలిచిపోయిన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ ఆవాజ్ కమిటీ నాయకులు బుధవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వినతిపత్రం అందజేశారు.
2014-19 మధ్య శంకుస్థాపన జరిగిన ఈ రూ.18 కోట్ల ప్రాజెక్టు నిలిచిపోవడంతో ముస్లిం బాలికలు విద్యకు దూరమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు షేక్ ఫైరోజ్, సీపీఎం నేత వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story




