Chilakaluripet: ప్రమాద బాధితులకు రూ. 80 లక్షల పరిహారం అందజేత!

Chilakaluripet: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 8 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 80 లక్షల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 31 Aug 2026 3:25 PM IST
Chilakaluripet
X

Chilakaluripet: ప్రమాద బాధితులకు రూ. 80 లక్షల పరిహారం అందజేత!

Chilakaluripet: చిలకలూరిపేట రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.80 లక్షల ఆర్థిక సాయం.

ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతిక శుక్లా చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ. రూ.10 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత.

చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన 8 మంది రోడ్డు ప్రమాదంలో మృతి.

ఈ నెల 27న చిలకలూరిపేట సమీపంలో ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఘోర ప్రమాదం. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.80 లక్షల పరిహారం అందజేత.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజాప్రతినిధులు భరోసా.

బాధిత కుటుంబాల పరిస్థితిని తెలుసుకుని వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని త్వరితగతిన అందించేలా చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు సానుభూతి తెలియజేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA

Next Story