Vinukonda: విద్యార్థి చదువుకు రవాణా అడ్డంకి కారాదు: జీవీ ఆంజనేయులు
Vinukonda: వినుకొండ నుంచి నూజెండ్లకు నూతన ఆర్టీసీ బస్సును చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు; విద్యార్థుల చదువుకు రవాణా అడ్డంకి కారాదని తెలిపారు.
Vinukonda: విద్యార్థి చదువుకు రవాణా అడ్డంకి కారాదు: జీవీ ఆంజనేయులు
Vinukonda: విద్యార్థుల చదువుకు రవాణా సమస్య అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సేవలను విస్తరిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.
పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.వినుకొండ నుంచి నూజెండ్లకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును జీవీ ఆంజనేయులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినుకొండ నుంచి జంగాలపల్లి, మదమంచిపాడు, త్రిపురాపురం, గొల్లపాలెం, ఓబనపాలెం, రెడ్డిపాలెం, కమ్మవారిపాలెం మీదుగా నూజెండ్ల వరకు ఈ సర్వీసు నడుస్తుందని తెలిపారు.
నూజెండ్ల మోడల్ స్కూల్, కేజీబీవీతో పాటు మార్గంలోని పలు పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడేలా స్కూల్ సమయాలకు అనుగుణంగా బస్సు నడిచేలా చర్యలు తీసుకున్నామన్నారు.విద్యార్థులు చదువుకోవాలంటే పాఠశాల ఉండటంతో పాటు సురక్షితమైన రవాణా సదుపాయం కూడా అవసరమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినుకొండ ఆర్టీసీ డిపోకు 32 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణాను మెరుగుపరచడంతో పాటు పర్యావరణహిత రవాణాలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.




