Vinukonda: ప్రజల చెంతకే పాలన.. వినుకొండ ప్రజలకు చీఫ్ విప్ భరోసా!

Vinukonda: వినుకొండ ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో జీవీ ఆంజనేయులు ప్రజాదర్బార్ నిర్వహించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 12 May 2026 4:04 PM IST
Vinukonda
X

Vinukonda: ప్రజల చెంతకే పాలన.. వినుకొండ ప్రజలకు చీఫ్ విప్ భరోసా!

వినుకొండ: వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో ఆయనకు సమర్పించారు.

మౌళిక సదుపాయాల లోపాలు, పెన్షన్ల మంజూరు, విద్యుత్ సమస్యలు, రోడ్లు, తాగునీటి సమస్యలు తదితర అంశాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విన్న జీవీ ఆంజనేయులు, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల చెంతకే పాలనను తీసుకురావడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story