Vinukonda: వినుకొండలో చీఫ్ విప్ జీవీ తనిఖీలు

Vinukonda: వినుకొండ నరసరావుపేట రోడ్డులో మురుగునీటి శుద్ధి ప్లాంట్ (STP) పనులను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.

KAREEMULLA, VINUKONDA
Published on: 30 May 2026 3:06 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో చీఫ్ విప్ జీవీ తనిఖీలు

వినుకొండ: పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో నిర్మాణంలో ఉన్న సూయజ్ శానిటేషన్ వాటర్ ప్లాంట్ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ. ఆంజనేయులు పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణ నాణ్యత, పనుల పురోగతి, ఉపయోగిస్తున్న సాంకేతిక ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అధికారులు జీవీకి వివరించారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో మురుగునీటి శుద్ధి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతికతతో ప్లాంట్‌ను నిర్మించాలని సూచించారు. పనుల్లో ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని జీవీ పేర్కొన్నారు. ప్రజలకు శుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story