Palnadu: రూ. 1.85 కోట్లతో గిరి ప్రదక్షిణ రోడ్డు.. భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన జీవీ!

Palnadu: వినుకొండలో రూ.1.85 కోట్లతో చేపట్టిన గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తనిఖీ చేశారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 11 May 2026 11:42 AM IST
Palnadu
X

Palnadu: రూ. 1.85 కోట్లతో గిరి ప్రదక్షిణ రోడ్డు.. భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన జీవీ!

Palnadu: ​ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. వినుకొండలో రూ.1.85 కోట్ల వ్యయంతో చేపట్టిన రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా, భక్తులు, స్థానికుల సౌకర్యార్థం పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్ తీరు "దెయ్యాలు వేదాలు వల్లించినట్లు" ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీట వేసిందని, శాంతిభద్రతల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ దేశంలోనే అవార్డులు పొంది ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. అలాంటి గౌరవప్రదమైన పోలీసు వ్యవస్థను అభాసుపాలు చేసేలా జగన్ ట్వీట్ చేయడం బాధాకరమని, కనీసం లా అండ్ ఆర్డర్ పట్ల అవగాహన లేని జగన్ పోలీసులపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story