Vinukonda: వెలిగొండ పూర్తి చేసి నీళ్లందించింది కూటమి ప్రభుత్వమే!
Vinukonda: శావల్యాపురం ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, వైకాపా నేతల తీరుపై మండిపడ్డారు.
Vinukonda: వెలిగొండ పూర్తి చేసి నీళ్లందించింది కూటమి ప్రభుత్వమే!
Vinukonda: నియోజకవర్గం,శావల్యాపురం ఎస్టీ కాలనీలోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర అర్హులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మందికి ప్రతి నెలా ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తూ సామాజిక భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
గతంలో రూ.3 వేలుగా ఉన్న సామాజిక భద్రతా పెన్షన్‌ను కూటమి ప్రభుత్వం రూ.4 వేలకు పెంచిందని, దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు రెట్టింపు చేశామని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రత కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు.అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పెన్షన్ అందని వారికి త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు.
ప్రతి అర్హుడికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కలను చంద్రబాబు ప్రభుత్వం సాకారం చేసి కృష్ణా జలాలను అందించిందని జీవీ అన్నారు. ప్రాజెక్టు ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 40 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.ఐదేళ్లలో వెలిగొండను పూర్తి చేయలేని జగన్.. చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు అందిస్తే ఇప్పుడు క్రెడిట్ తమదేనని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. జగన్‌వి ‘క్రెడిట్ చోరీ’ రాజకీయాలని జీవీ ఆంజనేయులు అన్నారు.




