Vinukonda: వినుకొండలో ప్రజాదర్బార్: సమస్యలు విన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
Vinukonda: వినుకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో జీవీ ఆంజనేయులు ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Vinukonda: వినుకొండలో ప్రజాదర్బార్: సమస్యలు విన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
Vinukonda: వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను జీవీ ఆంజనేయులుకు నేరుగా విన్నవించారు. పలువురు మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు.
ప్రజల నుంచి వినతులను స్వీకరించిన జీవీ ఆంజనేయులు ప్రతి సమస్యను ఓపికగా విని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రజాదర్బార్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజల చెంతకు పాలనను చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.




