Guntur: కొమ్మమూరు బ్రిడ్జి వద్ద గణేశ్ నిమజ్జనానికి అనుమతి లేదు: ఎస్సై!

Guntur: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొమ్మమూరు బ్రిడ్జి వద్ద నిర్మాణ పనుల దృష్ట్యా గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని ఎస్సై వీరనారాయణ స్పష్టం చేశారు.

SHAREEF, PONNURU
Published on: 15 Sept 2026 6:31 PM IST
Guntur
X

Guntur: కొమ్మమూరు బ్రిడ్జి వద్ద గణేశ్ నిమజ్జనానికి అనుమతి లేదు: ఎస్సై!

గుంటూరు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొమ్మమూరు బ్రిడ్జి వద్ద వినాయక విగ్రహం నిమజ్జనానికి అనుమతి లేదని చేబ్రోలు ఎస్సై వీరనారాయణ అన్నారు. కొమ్మమూరు బ్రిడ్జి వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నందున వినాయకుని నిమజ్జనానికి పరిస్థితులు అనుకూలంగా లేవని అన్నారు.

వినాయక నిమజ్జనం చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజల భద్రత దృష్ట్యా బ్రిడ్జి వద్ద నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించకూడదని అన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU