Guntur: కిట్స్ కళాశాలలో ఘనంగా బీటెక్ మొదటి సంవత్సర తరగతుల ప్రారంభం!
Guntur: గుంటూరు వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు కేకేఆర్ & కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్)లో ఘనంగా బీటెక్ ప్రథమ సంవత్సర ఓరియంటేషన్.
Guntur: కిట్స్ కళాశాలలో ఘనంగా బీటెక్ మొదటి సంవత్సర తరగతుల ప్రారంభం!
Guntur: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు కిట్స్ లో ఘనంగా ఇనాగరేషన్ అండ్ ఓరింటేషన్ ప్రోగ్రాం/ఘనంగా బీటెక్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభించారు. వింజనంపాడు (కిట్స్) కేకేఆర్ & కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (KITS), గుంటూరు కళాశాలలో
బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఇనాగరేషన్ అండ్ ఓరింటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.జ్యోతి ప్రజ్వలన చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ డాక్టర్ కోయ సుబ్బారావుగారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా క్రమశిక్షణ అంటే కిట్స్ కాలేజ్ ,ఉద్యోగాలు అంటే కిట్స్ కాలేజ్ ,ఇన్నోవేషన్ పేటెంట్స్ అంటే కిట్స్ కాలేజ్ ,స్టార్ట్ అప్స్ అంటే అంటే కాలేజ్ .గత 18 సంవత్సరాలగా సమాజంలో ఉన్న తల్లిదండ్రులుకు మా మీద పెట్టుకున్న నమ్మకం ,మా కళాశాల యాజమాన్యం కృషితో ఈరోజు జాతీయస్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో ముఖ్యంగా JNTUK యూనివర్సిటీ స్థాయిలో ఒక ప్రముఖమైన స్థానం సాధించిందని గర్వంగా చెబుతున్నాను.
నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టుకుంటూ తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. కాలానికి అనుగుణంగా ఆలోచనల్లో మార్పు తెచ్చుకున్నప్పుడే సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. పాత ఆలోచనా విధానాన్ని వీడి, సమస్యలను పరిష్కరించే సృజనాత్మక దృష్టిని అలవర్చుకోవాలి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో అందుబాటులోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను నేర్చుకుంటూ ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవాలి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
కళాశాల కార్యదర్శి శ్రీ కోయి శేఖర్ గారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సమయపాలన మాత్రమే ఒక వ్యక్తిని ఉత్తమ నాయకుడిగా తీర్చిదిద్దుతాయి మరియు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి నిరంతర సాధన, క్రమశిక్షణే ప్రధాన ఆయుధాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ప్రిన్సిపల్ డా. పి. బాబు గారు మాట్లాడుతూ కాలేజీ పెట్టిన మొదటి సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రిన్సిపాల్ గా కళాశాల యాజమాన్యం నాకు అవకాశం ఇచ్చారుని , విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నాలుగేళ్ల బీటెక్ విద్యను సద్వినియోగం చేసుకొని మంచి ఇంజనీర్లుగా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు ,నూతన విద్యార్థులకు ఆయా విభాగాల విద్యా కార్యక్రమాలు ప్రయోగశాలలు ప్రాజెక్టులు ఇంటర్సిటీ ప్లేస్మెంట్ మరియు ఇతర అవకాశాల గురించి వివరించారు.
డైరెక్టర్ డాక్టర్ కే హరి బాబు గారు మాట్లాడుతూ వివిధ విభాగాల సబ్జెక్టుల గురించి , పరీక్షల విధానాల గురించి మార్కులు, హాజరు, కళాశాల నిబంధనల గురించి వివరించారు మరియు తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశారు. కేవలం ఉద్యోగం సాధించడమే లక్ష్యం కాకుండా, సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపుతూ సొంతంగా స్టార్టప్‌లు, పరిశ్రమలు స్థాపించే దిశగా విద్యార్థులు ఆలోచించాలి. తద్వారా ఉద్యోగాలు కోరేవారిగా కాకుండా, పది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఇయర్ హెచ్ వో డి బసవేశ్వర రావు గారు మరియు గోపాలకృష్ణ గారు, సి ఎస్ సి హెచ్ ఓ డి డాక్టర్ R రమేష్ గారు , సి ఎస్ ఎం హెచ్ ఓ డి డాక్టర్ ఎం మురళి గారు , సిఎస్డి హెచ్ ఓ డి డాక్టర్ భాను ప్రకాష్ గారు , ఈసీఈ హెచ్ ఓ డి డాక్టర్ ఆదినారాయణ గారు ,ఐటీ హెచ్ ఓ డి డాక్టర్ ఎం స్ స్ సాయి గారు ,త్రిబుల్ఈ హెచ్ ఓ డి డాక్టర్ రాజేష్ ,ఉపాధి కల్పన విభగాపు హెచ్ ఓ డి ch చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




