Vinukonda: బెల్టు షాపులపై మహిళల తిరుగుబాటు!
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో బెల్టు షాపులపై మహిళలు రణరంగం సృష్టించారు.
Vinukonda: బెల్టు షాపులపై మహిళల తిరుగుబాటు!
Vinukonda: వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో బెల్టు దుకాణాలు విస్తరిస్తున్నాయంటూ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కండ్రిక గ్రామానికి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ఆటోను గ్రామ మహిళలు అడ్డుకుని నిరసన చేపట్టారు. గ్రామంలో బెల్టు షాపుల కారణంగా యువత మద్యానికి బానిసవుతూ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న మద్యం సీసాలను మహిళలు స్వాధీనం చేసుకుని రోడ్డుపై పారబోసి తమ నిరసనను తెలియజేశారు. బెల్టు దుకాణాలు ఏరులై పారుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని, బెల్టు షాపులను వెంటనే మూసివేయాలని మహిళలు డిమాండ్ చేశారు. సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.




