Vinukonda: ఎంపీ లావు వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆగ్రహం
Vinukonda: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయుడిపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఫైర్. ఫోన్ ట్యాపింగ్, ఈడీ కేసుల హెచ్చరికలపై ఘాటు కౌంటర్.
Vinukonda: ఎంపీ లావు వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆగ్రహం
వినుకొండ: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయుడు తనపై ఈడీ కేసులు పెడతామని చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా స్పందించారు. ఎంపీ మాటలు నాడు ఒకలా, నేడు మరోలా ఉన్నాయని విమర్శించారు.
వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క పని కూడా చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను రెడ్డి వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడానని ఎంపీ చెప్పడం పూర్తిగా అసత్యమన్నారు.
ఒక బీసీ నాయకుడి వద్ద నుంచి రూ.30 కోట్లు తీసుకున్నానని చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని, ఆ నాయకుడి పేరు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో విడుదల రజిని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంపీ పాత్ర ఉందని, తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేయించారని ఆరోపించారు.
తాను తండ్రి ఆస్తులతో రాజకీయాల్లోకి రాలేదని, స్వశక్తితో కష్టపడి ఈ స్థాయికి ఎదిగానన్నారు. తన వ్యక్తిత్వం, ప్రజల పట్ల తన వైఖరి నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని బ్రహ్మనాయుడు విమర్శించారు.




