Bapatla: జూలై 14 లోపు ఓటర్ల సవరణ ముగించాలి.. అధికారులకు డెడ్‌లైన్
Bapatla: బాపట్ల జిల్లా వేమూరు గ్రామంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమాన్ని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పరిశీలించారు.
Bapatla: జూలై 14 లోపు ఓటర్ల సవరణ ముగించాలి.. అధికారులకు డెడ్‌లైన్
Bapatla: బాపట్ల జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వేమూరు నియోజకవర్గంలోని వేమూరు గ్రామంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేసే ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా సర్వే పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 84 శాతం సర్వే పూర్తైందని వెల్లడించిన ఆయన, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారులు, కలెక్టర్లు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. అలాగే ఓటర్లు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కూడా సర్వే విజయవంతానికి సహకరిస్తున్నారని తెలిపారు.
ఈ నెల 14వ తేదీలోపు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు సర్వే చేయించుకోని అర్హులైన ఓటర్లు వెంటనే తమ వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు లేదా వివరాల్లో మార్పులు చేసుకోవాల్సిన వారు ఫారం-6, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.




