Repalle: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి!
Repalle: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని బాపట్ల జిల్లా స్వీప్ చీఫ్ నోడల్ ఆఫీసర్ ఎల్. కోదండరామ్ పిలుపునిచ్చారు.
Repalle: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి!
Repalle: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బాపట్ల జిల్లా స్వీప్ చీఫ్ నోడల్ ఆఫీసర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎల్. కోదండరామ్ పిలుపునిచ్చారు.
గురువారం జిల్లాలోని వివిధ జూనియర్ కళాశాలల్లో స్వీప్ కార్యక్రమం ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు మరియు ఓటు హక్కు ప్రాధాన్యతపై విశేష అవగాహన సదస్సులు నిర్వహించారు.
125 మంది కావూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, 150 మంది చెరుకుపల్లి జూనియర్ కళాశాల విద్యార్థులు, 250 మంది ఎన్నారై కళాశాల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వీప్ టీమ్ సభ్యులు బి. సుబ్బారావు, ఎమ్. అనిల్ కుమార్ పాల్గొని విద్యార్థులకు ఓటు హక్కు విశిష్టతను వివరించారు.
Next Story




