Bapatla: ప్లాస్టిక్ నిషేధం బెడిసికొట్టింది మున్సిపల్ అధికారులపై ప్రజల తీవ్ర ఆగ్రహం!
Bapatla: బాపట్లలో నిషేధిత ప్లాస్టిక్ పై కలెక్టర్ ఆదేశాలు బుట్టదాఖలు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడకం.
Bapatla: ప్లాస్టిక్ నిషేధం బెడిసికొట్టింది మున్సిపల్ అధికారులపై ప్రజల తీవ్ర ఆగ్రహం!
Bapatla: బాపట్ల పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ పై తనిఖీలు చేసిన దాఖలాలు ఈ మధ్యకాలంలో ఇంతవరకు కనిపించలేదు. కలెక్టర్ ఆదేశాలను కూడా పక్కన పడేసి ఎవరు చెబితే మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్న బాపట్ల మున్సిపల్ అధికారులు. కొద్దిరోజుల క్రితం కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ హాసిని తనిఖీలు చేసినట్లు పేపర్లో ఫోటోలకి మాత్రమే పరిమితమైనారు.
ఆ తర్వాత కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. గత కొన్ని నెలల క్రితం ప్లాస్టిక్ పై విస్తృత తనిఖీలు చేసి హడావుడి చేసిన మున్సిపల్ అధికారులు ఈ మధ్యకాలంలో కనీసం వాటి వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు ఒక పక్కన జిల్లా కలెక్టర్ సింగిల్ - యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టినట్లు వ్యవహరిస్తున్న బాపట్ల మున్సిపల్ అధికారులు అంటే దీని అర్థం గతంలో చేసిన తనిఖీలు ఇప్పుడు ఎందుకు చేయడం లేదు.
అంటే ఎవరి మామూళ్లు వాళ్లకి వస్తున్నాయని అనుకోవాలా అని ప్రజలు విమర్శిస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి బాపట్ల పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.




