Bapatla: బాపట్లలో దోమల విజృంభణ పట్టించుకోని అధికారులు!
Bapatla: బాపట్ల మున్సిపాలిటీలో దోమల విజృంభణ. వాటర్ ట్యాంక్ కింద మూలనపడ్డ మెగా ఫాగింగ్ మిషన్. రిపేర్ల పేరిట నిధుల దుర్వినియోగంపై ప్రజల ఆగ్రహం.
Bapatla: బాపట్లలో దోమల విజృంభణ పట్టించుకోని అధికారులు!
Bapatla: బాపట్ల మున్సిపాలిటీ పట్టణ పరిధిలో విపరీతమైన దోమలతో ప్రజలు అల్లాడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో చిన్న పిల్లలు, వృద్ధులు విషజ్వరాలు, దగ్గు, జలుబు వంటి వ్యాధులతో హాస్పిటల్ పాలవుతున్నారు.ఈ దోమలు నియంత్రించాల్సిన ఫాగింగ్ మిషన్ పక్కన చెత్త బుట్టలో పడేసినట్లు పక్కన ట్యాంక్ కింద పడేశారు.
రిపేర్లు పేరుతో వేలు వేలు బిల్లు పెడుతూ వాటిని రిపేర్ చేయించకుండా నిరుపయోగంగా ఓ పక్కన పడటం ఎంతవరకు సమంజసమని ప్రజల అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాపట్ల ప్రజలను దోమల బారి నుంచి రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పక్కన పడేసిన ఫాగింగ్ మిషన్ వెంటనే నిజమైన మరమ్మతులు చేయించి వార్డుల్లో దోమల నియంత్రణకు వాడి ప్రజల ప్రాణాలను కాపాడాలని విశ్లేషకులు కోరుతున్నారు.




