Bapatla: బాపట్ల పురపాలక సంఘానికి 75 ఏళ్లు.. లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్యే!
Bapatla: బాపట్ల మున్సిపాలిటీ 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు. పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ.
Bapatla: బాపట్ల పురపాలక సంఘానికి 75 ఏళ్లు.. లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్యే!
Bapatla: తెలుగు జాతి చరిత్రలో బాపట్ల కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆంద్రోద్యమ పురిటిగడ్డ గా, తెలుగు తల్లి జన్మస్థలంగా బాపట్ల అలరారుతోంది. తెలుగుజాతి ఆస్తిత్వానికి బాపట్ల పునాదులు వేసింది.
అటువంటి బాపట్ల 1951 ఏప్రిల్ 2న పురపాలక సంఘంగా అవతరించింది.
ఈ ఉత్సవాలకు సంబంధించిన లోగోను బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, ఫోరం సభ్యులు జీవి, కార్యకర్తలు గొల్లపల్లి శ్రీనివాసరావు, చివుకుల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ పురపాలక సంఘ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను త్వరలో నిర్వహిస్తామని చెప్పారు.
పట్టణాన్ని స్వచ్ఛ బాపట్లగా,హరిత బాపట్లగా, సుందర బాపట్లగా అభివృద్ధి చేస్తామని వివరించారు.
ఫోరం కార్యదర్శి డాక్టర్ పి సి సాయిబాబు మాట్లాడుతూ,పట్టణ ప్రధమ మున్సిపల్ చైర్మన్ వెలగపూడి సుబ్బారావు విగ్రహాన్ని ఫోరం ఆధ్వర్యంలో చంద్ర కళా పార్కు లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. 1954 లో ఆయన నెలకొల్పిన విజయ స్థూపాన్ని కూడా ఫోరం పునరుద్ధ రించిందని వివరించారు.




