Bapatla: తహసీల్దార్ ఆఫీస్ వద్ద రైతు ఆత్మహత్యా యత్నం: బాపట్లలో కలకలం!
Bapatla: భూవివాదంపై అధికారులు స్పందించకపోవడంతో బాపట్ల జిల్లా చిన్నగంజాం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు వెంకటేశ్వరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం.
Bapatla: తహసీల్దార్ ఆఫీస్ వద్ద రైతు ఆత్మహత్యా యత్నం: బాపట్లలో కలకలం!
Bapatla: భూవివాదం నేపథ్యంలో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుమందు సేవించి బలవన్మరానికి యత్నించిన ఘటన బాపట్ల జిల్లా , చిన్నగంజాం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. బాధిత రైతు చిన్నగంజాం మండలం రాజు బంగారుపాలెం గ్రామనికి చెందిన ఆట్ల వెంకటేశ్వరెడ్డి గా గుర్తించిన స్థానికులు కుటుంబ సబ్యులకు సమాచారం అందించడంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం చీరాలలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈసందర్భంగా బాధిత రైతు కుటుంబసభ్యులు మాట్లాడుతూ తమకు అన్ని హక్కులు కలిగిన పొలాన్ని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు స్థానికంగా ఉన్న టీడీపీ కి చెందిన మండల పార్టీ నేతల సహకారంతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూన్నారని ఆరోపించారు .
ఈక్రమంలోనే గడచినా 10 రోజులుగా సాగు చేస్తున్న పొలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో పాటుగా భౌతిక దాడులకు దిగితున్నారన్నారు.అంతే కాకుండా పొలంలోని సాగుకు ఉపయెగించే పైపులు, మోటార్లను ధ్వంశం చేశారన్నారు .ఈ నేపథ్యంలో తమ పొలానికి సంబందించిన హక్కులకు సంబంచించిన పట్టాదారు పాస్ పుస్తకాలూ , పట్టా పత్రాలతో న్యాయం చేయమంటూ పోలీస్ స్టేషన్ , తహసీల్దార్ కార్యాలయం చివరికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి పిర్యాదు చేసిన పట్టించుకున్నవారే లేరని వాపోయారు.
కలెక్టర్ కు పిర్యాదు చేసిన క్రమంలో విచారణకు వచ్చిన అధికారులు సైతం కలెక్టర్ ను తప్పుదోవపట్టించే విధంగా రిపోర్ట్స్ పంపిస్తున్నారని ఆరోపించారు .ఇక అధికారులు చుట్టూ తిరిగితిరిగి విసికివేశారిపోయిన బాధిత రైతు వెంకటేశ్వరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైయి ,,, చిన్నగంజాం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుమందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలిపారు . ఇప్పటికైనా అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి న్యాయం చేయాలనీ బాధితులు కోరుతున్నారు .
కాగా బాధిత రైతు ప్రస్తుతం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు .కాగా ఘటన ఫై అవుట్ పోస్ట్ పోలీసులు వివరాలను సేకరించారు.




