Vellabadu: అగ్గిపెట్టె కోసం మొదలైన గొడవ వెల్లబాడులో వ్యక్తి దారుణ హత్య
Vellabadu: వేమూరు మండలం వెల్లబాడులో అగ్గిపెట్టె కోసం జరిగిన వివాదం హత్యకు దారితీసింది. మద్యం మత్తులో యోహానును కత్తితో పొడిచి చంపిన చరణ్.
Vellabadu: అగ్గిపెట్టె కోసం మొదలైన గొడవ వెల్లబాడులో వ్యక్తి దారుణ హత్య
Vellabadu: మద్యం మత్తులో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన వేమూరు మండలం వెల్లబాడులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెల్లబాటుకు సమీపంలో ఈపూరి యోహాను, చందర్తి చరణ్‌తో పాటు మరికొందరు మద్యం సేవిస్తున్నారు. ఈ సమయంలో సిగరెట్ వెలిగించేందుకు చరణ్ యోహానును అగ్గిపెట్టె అడిగాడు. అగ్గిపెట్టె లేదని యోహాను చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది.
పక్కనే ఉన్నవారు వారిని సముదాయించినప్పటికీ మద్యం మత్తులో ఉన్న చరణ్ కత్తితో యోహాను వెనుక వైపు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో యోహాను అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై వేమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు చరణ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ నజీర్ భాష తెలిపారు.




