Vinukonda: వినుకొండలో రైతు సంఘం మహాసభల హడావుడి.. చంద్రబాబు సర్కార్‌పై లీడర్ల డిమాండ్లు!

Vinukonda: వినుకొండలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభలు.

KAREEMULLA, VINUKONDA
Published on: 15 May 2026 4:59 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో రైతు సంఘం మహాసభల హడావుడి.. చంద్రబాబు సర్కార్‌పై లీడర్ల డిమాండ్లు!

Vinukonda: వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహించారు .ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు కృష్ణయ్య, శివశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైతులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న అగ్రహారం భూములకు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న వరికపూడిశిల ప్రాజెక్టు పనులను తక్షణమే ప్రారంభించి సాగునీటి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story