Undavalli: విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఉండవల్లిలో ర్యాలీ!

Undavalli: ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ ఉండవల్లి సెంటర్‌లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వివరాలు చూడండి.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 25 July 2026 11:24 AM IST
Undavalli
X

Undavalli: విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఉండవల్లిలో ర్యాలీ!

ఉండవల్లి:

నీట్ పేపర్ లీకేజీ కి వ్యవహారంపై ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర తమ ఆందోళన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జి కి నిరసనగా రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు

ఉండవల్లి సెంటర్లో జరిగిన ఈ ర్యాలీలో రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ పేపర్ లీకేజ్ అనేది ఒక హేయమైన చర్య యువత భవిష్యత్తుతో చలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన రైతు సంఘం నాయకులు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు జొన్న శివశంకరరావు, రైతు సంఘం కోశాధికారి సూర్యనారాయణ,తో పాటు పలువురు రైతు నాయకులు రైతులు పాల్గొన్నారు

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA

Next Story