Guntur: గుంటూరులో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన!
Guntur: గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు నిరసన చేపట్టాయి.
Guntur: గుంటూరులో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన!
గుంటూరు: ఏపీ జెఎసి అమరావతి ఆధ్వర్యములో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉద్యోగం సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిఎమ్ సి కార్యాలయములోని అన్ని విభాగాలలో పనిచేసే ఉద్యోగలను కలసి చేయి... చేయి.. కలిపి తమ డిమాండ్ ల సాధనకు సంఘటితం కావాలని కోరారు.
ఈ సందర్భంగా.. ఏపీ జెఎసి జిల్లా చైర్మన్ కిరణ్ కుమార్, ఏపీ ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధుబాబు మాట్లాడారు. గత ఐదు రోజుల నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈరోజు ప్రభుత్వంతో జరిగే చర్చలలో 30 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచినట్లు చెప్పారు.
ప్రభుత్వంతో ఈరోజు జరిగే చర్చలు సఫలీకృతం కావాలని ఆశభావం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు టైం స్కేల్ మరియు పెన్షనర్స్ కు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గతములో సీఎం చంద్రబాబు నాయుడు 43% ఫిట్ మెంట్ ఇచ్చారని, ఇప్పుడు కూడా తమ న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం చూపాలని కోరారు.
మాకు రావలసిన బకాయిలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈరోజు మా నాయకులతో జరిగే చర్చలు సఫలం అవుతాయని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 4 లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. 1లక్ష 10 వేల మంది ఆప్కాస్ లో పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం అధికారంలోకి రాకముందు టైం స్కేల్ మరియు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ తమ సమస్యలను పరిష్కరించలేదని చెప్పారు. కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈరోజు జరిగే చర్చల్లో అవుట్సోర్సింగ్ ఆప్కాస్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.




