Guntur: కేసులతో నన్ను భయపెట్టలేరు.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు!

Guntur: గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తనపై నమోదైన కేసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల తీరుపై పలు ఆరోపణలు గుప్పించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 25 Aug 2026 10:42 AM IST
Guntur
X

Guntur: కేసులతో నన్ను భయపెట్టలేరు.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు!

Guntur: నాపై పలు ఫైర్ లు నమోదు అయ్యాయి. ఓకే అంశం పై అనేక చోట్ల కేసులు పెట్టారు. సోషల్ మీడియా లో యీక్టీవ్ గా ఉన్నానని నా పై కేసులు. పెమ్మసాని పై వ్యంగ్య చిత్రం పోస్ట్ చేస్తే నా పై కేసులు. వెన్నుపోటు పై పాటను నా ఇంస్టాగ్రామ్, యూట్యూబ్లో పోస్ట్ చేశానని నాపై కేసు నమోదు చేశారు.

ఈ కేసు FIR నెంబర్ 478/26 పట్టాభి పురంలో కేసు రిజిస్టర్ అయింది. ప్రజలకు,మామకు, చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. నేను ఎందుకు పోస్టు చేస్తానంటే మాది గొడ్డలి పార్టీ అని టిడిపి వారు అంటున్నారు. దానికి ప్రతిగా వెన్ను పోటు పార్టీ అన్నాను.

ఒక కార్టూన్ లక్షలమందిని ఆకర్షిస్తూంది. వెన్నుపోటు పార్టీ అని ప్రతివిమర్శ చేసాం. ఇది ప్రజల్లో కి వెళ్లింది. మాజీ సీఎం పై అసభ్యంగా పోస్ట్లు చేస్తే కేసు రిజిస్టర్ చేయలేదు. నేను పలుమార్లు కంప్లైంట్ చేసా. పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారు.

ప్రతిపక్షం విమర్శలు చేస్తే కేసులు పెడుతున్నారు. యన్టీఆర్ పై ఆ రోజుల్లో అనేక సినిమాలు విడుదల అయ్యాయి. కృష్ణ కూడా యన్టీఆర్ పై సినిమా తీసారు, ఆయన ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఎవరిపై కేసులు నమోదు చేయలేదు. పోలీసులు గంజాయి అమ్ముతున్నారు.

పోలీసులు క్లబ్బులు ఆడిస్తున్నారు. అందులో ఐజీ కి డబ్బు లు ముడుతున్నాయి. చిలకలూరిపేట, సత్తెనపల్లి, రేపల్లె పలుచోట్ల క్లబ్ లు నడుపుతున్నారు. రోజుకు 20లక్షల ఆదాయం, పోలీసులు, ప్రజాప్రతినిధులు పంచుకుంటున్నారు. నన్ను కేసులతో భయ పెట్టలేరు.

నేను కార్టూన్లు ద్వారా నా అభిప్రాయం చెబుతాను. నేరం రుజువు అయ్యేదాకా నిర్ధోషిని. కారుమూరు, ముస్తఫా ను జైల్లో పెట్టారు. ఏదైనా న్యాయపరంగా ఎదుర్కోంటాను.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story