Vinukonda: నకిలీ విత్తనాలతో రైతుల కష్టాలు న్యాయం కోసం అగ్నిగుండాల రైతుల
Vinukonda: వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామంలో "అజిత" రకం నకిలీ వరి విత్తనాల వల్ల రైతులు 100 ఎకరాల్లో పంట నష్టపోయారు.
Vinukonda: నకిలీ విత్తనాలతో రైతుల కష్టాలు న్యాయం కోసం అగ్నిగుండాల రైతుల
వినుకొండ: వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామంలో నకిలీ వరి విత్తనాల వ్యవహారం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. “అజిత” అనే పేరుతో విక్రయించిన వరి విత్తనాలను నమ్మి రైతులు సుమారు 100 ఎకరాల్లో సాగు చేపట్టారు. అయితే పంట కోత దశకు చేరుకున్న తర్వాత ఎకరాకు కనీసం 15 బస్తాల దిగుబడి కూడా రాకపోవడంతో రైతులకు అనుమానం మొదలైంది. భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేసినప్పటికీ ఆశించిన ఫలితం లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోసపోయిన రైతులు పోలీసులను ఆశ్రయించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి విత్తనాల నాణ్యతపై దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేసి ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.




