Addanki: పోలీస్ కారులో గంజాయి కలకలం హోం మంత్రి రాజీనామాకు లాయర్ డిమాండ్!

Addanki: అద్దంకి వద్ద ఆటోను ఢీకొట్టిన పోలీస్ కారులో గంజాయి. ఇద్దరు ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది నక్కా రజిని మీడియాతో డిమాండ్.

Kolla Singaiah, Addanki
Published on: 17 Aug 2026 3:44 PM IST
Addanki
X

Addanki: పోలీస్ కారులో గంజాయి కలకలం హోం మంత్రి రాజీనామాకు లాయర్ డిమాండ్!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ ఆవరణలో హైకోర్టు లాయర్ నక్కా రజిని మీడియాతో మాట్లాడారు.అద్దంకి మండలం శంకవరప్పాడు గ్రామంలో ఆటోను ఢీకొన్న పోలీస్ కారు.ప్రమాదానికి కారణమైన కారును తనిఖీ చేసిన గ్రామస్తులు.కారు లో గంజాయి రవాణా చేస్తూ మద్యం తాగిన ఉన్న ఇద్దరు ఎస్ఐల పై ఆగ్రహం చెందిన గ్రామస్తులు.ఇద్దరు ఎస్ఐలపై ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు.

గంజాయి వాడకం పెను ప్రమాదాలకు కారణమన్నారు.కొలికిపూడి శ్రీనివాస్ గతంలో ఎస్సై అండతో గంజాయి నడుస్తుందని ముందే చెప్పారన్నారు.గంజాయి అరికట్టిన ఆంధ్ర రాష్ట్రం అని తెలిపిన సీఎం చంద్రబాబు నేడు ఆ గంజాయి నీ తరలిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోలేకపోయారు,అని వాపోయారు. ఇద్దరు ఎస్ఐలపై ఇంతవరకు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదని ఆమె అడిగారు.

ఈ ఘటనపై హోం మంత్రి అనిత అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పాలని , మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story