Mangalagiri: మంగళగిరి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వద్ద ఏబీవీపీ ధర్నా
Mangalagiri: ఆంధ్రప్రదేశ్లో విద్యా సంవత్సరం అడ్మిషన్ల జాప్యంపై మంగళగిరి ఉన్నత విద్యా మండలి (APSCHE) కార్యాలయం వద్ద ఏబీవీపీ భారీ ధర్నా నిర్వహించింది.
Mangalagiri: మంగళగిరి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వద్ద ఏబీవీపీ ధర్నా
Mangalagiri: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మంగళగిరి 6th బెటాలియన్ వద్ద ఉన్న ఉన్నత విద్య మండలి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెట్స్ యొక్క కౌన్సిలింగ్ ను పూర్తి చేసి ఆగస్టులోగా మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థులు పరుగు రాష్ట్రాలకి వలస పోతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండడం దురదృష్టకరమన్నారు రాష్ట్రంలో అడ్మిషన్లు సమయానికి పూర్తవనందున విద్యార్థులంతా కూడా లక్షలకు లక్షలు ఫీజులు ధారబోసి పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో విద్య కోసం వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి సంవత్సరం ఉన్నత విద్యా మండలి అకాడమీ క్యాలెండర్ను ప్రకటిస్తున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలు అవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒకే సమయానికి డిగ్రీలు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా 2026 - 27 విద్యా సంవత్సరానికి గాను ఫీజులను ప్రకటించి ఫీజు నియంత్రణ మండలి ను పటిష్ట పరచాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలో ప్లీజ్ రియంబర్స్మెంట్ తో సంబంధం లేకుండా విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయడానికి వ్యతిరేకించారు దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మధు మూర్తి ని కలిసి వినతి పత్రం అందజేశారు.
చైర్మన్ 202627 సంవత్సరానికి గాను అకడమిక్ క్యాలెండర్ ను ప్రటిష్టంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అఖిల్,సాయి, సురేంద్ర మరియు జాతీయ కార్యవర్గ సభ్యురాలు వేదశ్రీ మరియు కార్యకర్తల పాల్గొన్నారు.




