Guntur: గుంటూరు తూర్పులో టీడీపీలోకి 57 మంది వైసీపీ నేతల చేరిక!

Guntur: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సమక్షంలో 57 మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. కూటమి అభివృద్ధికి ఆకర్షితులై చేరినట్లు నేతలు తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 15 Sept 2026 8:32 PM IST
Guntur
X

Guntur: గుంటూరు తూర్పులో టీడీపీలోకి 57 మంది వైసీపీ నేతల చేరిక!

గుంటూరు: ‘రెండేళ్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాం. అందుకే ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.

త్వరలోనే వైసీపీని ఖాళీ చేస్తామ’ని ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. మంగళవారం స్థానిక తూర్పు కార్యాలయంలో 2 వార్డు నుంచి షేక్ సులేమాన్ బాషా ఆధ్వర్యంలో 25 మంది, 55 వార్డులో టీడీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కాలె దేవదాస్ ఆధ్వర్యంలో 32 మంది వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వీరికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో మైనార్టీలకు, స్థానిక ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని భావించి ప్రజలు వైసీపీని వీడుతున్నారని చెప్పారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలలో నమ్మకం పెరిగిందన్నారు. మైనార్టీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.

ఇప్పటికే నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పార్టీ కష్టపడి పని చేసే వారికి సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ అందిస్తున్న ప్రజా సేవకు ఆకర్షితులమై తెలుగుదేశం పార్టీలో చేరామని తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN