Tripuranthakam: పూజ గదిలోకి 5 అడుగుల త్రాచుపాము.. భయాందోళనలో కుటుంబం!
Tripuranthakam: త్రిపురాంతకం మండలం నాసర్‌రెడ్డి కోష్టాలలో ఓ ఇంటి పూజ గదిలోకి దూరిన 5 అడుగుల త్రాచుపామును స్నేక్ రెస్క్యూ బృందం సురక్షితంగా పట్టుకుంది.
Tripuranthakam: పూజ గదిలోకి 5 అడుగుల త్రాచుపాము.. భయాందోళనలో కుటుంబం!
మార్కాపురం జిల్లా: త్రిపురాంతకం మండలంలోని నాసర్‌రెడ్డి కోష్టాలు గ్రామానికి చెందిన పోకూరి కృష్ణ ఇంట్లోని పూజ గదిలోకి సుమారు 5 అడుగుల పొడవైన త్రాచుపాము ప్రవేశించింది. పూజ గదిలో పామును గుర్తించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే మల్లికార్జున స్నేక్ రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు. దీంతో రెస్క్యూ బృందం ఇంటికి చేరుకుని చాకచక్యంగా త్రాచుపామును సురక్షితంగా పట్టుకున్నారు అనంతరం పామును సురక్షిత ప్రదేశమైన అడవిలో వదిలారు.




