Kukunoor: రక్తంతో రాసిన పోస్ట్‌కార్డులతో మహిళల నిరసన
Kukunoor: మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కుక్కునూరు పోస్టాఫీస్ వద్ద మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రక్తంతో రాసిన పోస్ట్ కార్డులతో నిరసన చేపట్టారు.
Kukunoor: రక్తంతో రాసిన పోస్ట్‌కార్డులతో మహిళల నిరసన
Kukunoor: ఎటువంటి షరతులు లేకుండా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరుతూ శనివారం ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని పోస్టాఫీస్ కార్యాలయం వద్ద ఏలూరు మహిళా సమాఖ్య అధ్యర్యంలో రక్తంతో కూడిన పోస్ట్ కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరకా.శ్యామల మాట్లాడుతూ 2023 లో పార్లమెంటులో ఆమోదం పొందిన నారి శక్తి వందన్ అధినీయం బిల్లు ప్రవేశపెట్టి చట్టరూపంలో అమలు చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జన గణన, నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును జన గణన, నియోజకవర్గాలకు పునర్ విభజనతో ముడిపెట్టి బిల్లును నీరుగార్చే కుట్ర చేస్తుందని విమర్శించారు.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతుందని ఆరోపించారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలను చట్టసభలకు పంపి నిర్ణయాధికారంలో భాగస్వామ్యం లేకుండా దూరం చేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అనిన్నారు. మహిళలు దశాబ్దాలుగా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నా పాలకులకు రిజర్వేషన్ అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కొన్నె. జయశ్రీ, వేల్పుల. తిరుపతమ్మ, కుమారి, సావిత్రి, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.




