VR Puram: సోములగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 31 మందికి అస్వస్థత
VR Puram: అల్లూరి జిల్లా వీఆర్ పురం మండలం సోములగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. చికిత్స పొందుతున్న 31 మంది విద్యార్థినులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి.
VR Puram: సోములగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 31 మందికి అస్వస్థత
వీఆర్ పురం: పోలవరం జిల్లా వరరామచంద్రాపురం మండలం సోములగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 31 మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆదివారం చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ రంపచోడవరం ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆమె దుయ్యబట్టారు.ఆశ్రమ పాఠశాలలలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని విమర్శించారు.
ఈ రెండేళ్ల కూటమి పాలనలో రంపచోడవరం ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాలల లోని విద్యార్థులు మరణించడం,ఫుడ్ పాయిజన్ జరగడం వంటివి అనేక సంఘటనలు చోటు చేసుకోవడం దీనికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రంపచోడవరం ఏజెన్సీ లోని ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.




