Eluru: ఏలూరు జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు!

Eluru: ఏలూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Sept 2026 9:52 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు!

ఏలూరు: ఏలూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామాలు,పట్టణాల్లోని ప్రతి వీధి, వాడలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి పుష్పాలంకరణలు,ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా జిల్లాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

ఉదయం నుంచే ఆలయాలు,మండపాలు భక్తులతో కిటకిటలాడాయి.అయితే ఈ ఏడాది మట్టి వినాయక విగ్రహాల వినియోగానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది.ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి,జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ మట్టి విగ్రహాలనే ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

రసాయన రంగులు,ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందుకే పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా ప్రకృతిని కాపాడాలని అధికారులు సూచించారు.

భక్తి భావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయకుడిని పూజించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు.‘మట్టి వినాయకుడు పర్యావరణానికి మేలు’ అనే సందేశంతో ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు భక్తి,సంప్రదాయం,పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా కొన్నిచోట్ల నిలిచాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్