Velerupadu: వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల నిరసన!

Velerupadu: వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల నిరసన. 9 ఏళ్లుగా రూ.10,500 వేతనంతో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Sept 2026 2:09 PM IST
Velerupadu
X

Velerupadu: వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల నిరసన!

Velerupadu: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ వీఆర్ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ మండల నాయకులు పిట్ట రమేష్, రాంబాబు, రాజు డిమాండ్ చేశారు. బుధవారం వేలేరుపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం శాంతియుత ఉద్యమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 20 వేల మంది వీఆర్ఏలు గ్రామస్థాయిలో రెవెన్యూ శాఖ విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. తొమ్మిదేళ్లుగా రూ.10,500 వేతనంతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి న్యాయం చేయాలని కోరారు. వీఆర్ఏల శాంతియుత ఉద్యమాలను గుర్తించి, న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వీఆర్ఏలందరూ ఐక్యంగా కదిలి ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేలేరుపాడు మండలం పరిధిలోని వీఆర్ఏలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్