Velairpadu: వేలేరుపాడు పీహెచ్‌సీలో ఉద్యోగుల నిరసన!
Velairpadu: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100% గ్రాస్ జీతం డిమాండ్‌తో వేలేరుపాడు పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంల నల్ల బ్యాడ్జీల నిరసన. ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి.
Velairpadu: వేలేరుపాడు పీహెచ్‌సీలో ఉద్యోగుల నిరసన!
Velairpadu: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ జీతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన శాంతియుత నిరసనకు సచివాలయ ఏఎన్‌ఎంలు నల్ల బ్యాడ్జీలు ధరించి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు సున్నం శ్రీరాములు దొర మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే 30 రోజుల గడువు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలతో కలిసి ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ తెల్లం మల్లమ్మతో పాటు మధు, గంగజాలం, శివపార్వతి, రాజ్యలక్ష్మి, మంగవేణి, శివకుమారి, భూలక్ష్మి, పద్మ, మంగమ్మ, సావిత్రి, నాగేశ్వరావు, చంద్రబాబు తదితర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




