Velairpadu: ఎద్దువాగు బ్రిడ్జిపైకి వరద నీరు బోటు ఏర్పాటు చేసిన అధికారులు

Velairpadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు పొంగి బ్రిడ్జిపైకి వరద నీరు చేరడంతో 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 26 Aug 2026 5:52 PM IST
Velairpadu
X

Velairpadu: ఎద్దువాగు బ్రిడ్జిపైకి వరద నీరు బోటు ఏర్పాటు చేసిన అధికారులు

వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని ఏడవల్లి – బోళపల్లి గ్రామాల మధ్య ఉన్న ఎద్దువాగులోకి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు భారీగా చేరడంతో వాగు పొంగి ఎద్దువాగు బ్రిడ్జి పైకి వరద నీరు చేరడంతో వాగు అవతల ఉన్న సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి పెరగడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్, ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని ఎద్దువాగు వరద ఉద్ధృతిని పరిశీలించారు. గిరిజన గ్రామాల ప్రజలు అత్యవసర పనుల నిమిత్తం రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గుర్తించి, అధికారులు తాత్కాలికంగా మరబోటును ఏర్పాటు చేశారు.

వరద ఉద్ధృతి తగ్గే వరకు ప్రజలు వాగును దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మరబోటును వినియోగించుకోవాలని తెలిపారు. వాగుపై శాశ్వత వంతెన ఏర్పాటు చేసి, వర్షాకాలంలో తమ రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story