Unguturu: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి పుప్పాల వాసుబాబు
Unguturu: ఉంగుటూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 2వ రోజు రిలే నిరాహార దీక్ష. డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు.
Unguturu: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి పుప్పాల వాసుబాబు
ఉంగుటూరు: డీఎస్సీ–2025 నియామకాలలో చోటుచేసుకున్న అవకతవకలు, స్పోర్ట్స్ కోటా అక్రమాలు, నిరుద్యోగ భృతి అమలులో జాప్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యాదీవెన–వసతి దీవెన నిధుల విడుదలలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉంగుటూరు నేషనల్ హైవే సెంటర్ వద్ద చేపట్టిన 2వ రోజు రిలే నిరాహార దీక్షలో నిడమర్రు మండలం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మరియు యువతతో కలిసి పాల్గొన్న ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు శ్రీ పుప్పాల వాసుబాబు గారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాలలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలలో జరిగిన అవినీతి వెలుగులోకి తీసుకువచ్చి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.
విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి వేలాది మంది విద్యార్థులను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల చదువులు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన భృతి హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు. నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన ర్యాలీలో నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు నిడమర్రు మండలం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.




