Eluru: ఆదివాసీ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ విధుల బహిష్కరణ వాయిదా!

Eluru: ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నెల 8 నుంచి చేపట్టాల్సిన విధుల బహిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ఏలూరు జిల్లా సంఘం అధ్యక్షుడు శ్రీరాములు దొర తెలిపారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 6 Sept 2026 12:55 PM IST
Eluru
X

Eluru: ఆదివాసీ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ విధుల బహిష్కరణ వాయిదా!

Eluru: ఒప్పంద ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నెల 8 నుంచి చేపట్టాలని నిర్ణయించిన విధుల బహిష్కరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు సున్నం శ్రీరాములు దొర తెలిపారు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ వేతనం తదితర సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆన్‌లైన్ వర్క్ నిరసన, 30 రోజుల శాంతియుత నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన కోరారు.

ప్రభుత్వం ఇచ్చిన 30 రోజుల గడువులోగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం వెంకటేశ్వరరావు, జేఏసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చవలం దుర్గాప్రసాద్, చంటి పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story